Geetha Govindam Song Lyrics

Print Friendly, PDF & Email

చిత్రం: గీత గోవిందం (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న
దర్శకుడు: పరశురాం
నిర్మాత: బన్నీ వాసు

Inkem Inkem Inkem Kaavale Song Lyrics in Telugu

తదిగిన తకజును తదిగిన తకజును తరికిట తదరిన తధిమిత ఆనందం
తలవని తలపుగ ఎదలను కలుపగ  మొదలిక మొదలిక మల్లి గీత గోవిందం
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లే
గుండెల్లోన వేగం పెంచావే… గుమ్మంలోకి హోళీ తెచ్చావే
ను పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కో గంట ఒక్కో జన్మయ్, మళ్లి పుట్టీ చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లే
తదిగిన తకజును తదిగిన తకజును
తరికిట తదరిన తధిమిత ఆనందం
తలవని తలపుగ ఎదలను కలుపగ
మొదలిక మొదలిక మల్లి గీత గోవిందం

ఊహలకు దొరకని  సొగసా ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా
నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభసా
నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశా
నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకొని గగనపు కొనలే చూసా 

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లే
మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా
పంతములు విడువని బిగువా జరిగినదడగవా
నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవా చెలిమిగ మెలగవా
నా పేరు తలచితె ఉబికే లావా చల్లబడి నను నువ్వు కరుణించేవా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లే
గుండెల్లోన వేగం పెంచావే… గుమ్మంలోకి హోళీ తెచ్చావే
ను పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కో గంట ఒక్కో జన్మయ్, మళ్లి పుట్టీ చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లే
తదిగిన తకజును తదిగిన తకజును
తరికిట తదరిన తధిమిత ఆనందం
తలవని తలపుగ ఎదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్ళి గీత గోవిందం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *