Em Sandeham Ledu Song Lyrics

Print Friendly, PDF & Email

చిత్రం: ఊహలు గుసగుసలాడే
నటీనటులు: నాగ శౌర్య, రాశి ఖన్నా
గానం: కళ్యాణ్ కోడూరి, సునీత
సంగీతం: కళ్యాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల

Em Sandeham Ledu Song Lyrics from Oohalu Gusagusalade Movie

ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు… ఆ గంధాల గొంతె
ఆనందాలు పెంచింది

నిమిషము నేల మీద… నిలువని కాలి లాగ
మది నిను చేరుతోందే చిలకా..!
తనకొక తోడు లాగ… వెనకనే సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖ

ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా… వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి… నీ కళ్ళాపి చల్లి
ఓ ముగ్గేసి వెళ్ళావే

నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ
మది నిన్ను చేరుతుంది చిలకా..!
తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖ

వెన్నెల్లో ఉన్నా… వెచ్చగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే

ఈ కొమ్మల్లో గువ్వ… ఆ గుమ్మంలోకెళ్ళి
కూ అంటోంది విన్నావా
ఈ మబ్బుల్లో జల్లు… ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నావా
ఏమవుతున్నా గాని… ఏమైనా అయిపోనీ
ఏం ఫరవాలేదన్నావా

అడుగులు వేయలేక… అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక… బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *