చిత్రం: లవ్ స్టోరీ
నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి
గానం: మంగ్లీ
సంగీతం: పవన్ సీ.హెచ్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా
దర్శకుడు: శేఖర్ కమ్ముల
Saranga Dariya Song Lyrics in Telugu from Love Story Movie
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
కాళ్ళకు ఎండీ గజ్జెల్…
లేకున్నా నడిస్తే ఘల్ ఘల్..
కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్..
నవ్వుల లేవుర ముత్యాల్…
అది నవ్వితే వస్తాయ్ మురిపాల్..
నోట్లో సున్నం కాసుల్…
లేకున్నా తమల పాకుల్..
మునిపంటితో మునిపంటితో…
మునిపంటితో నొక్కితే పెదవుల్..
ఎర్రగా అయితదిర మన దిల్
చురియా చురియా చురియా…
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
రంగేలేని నా అంగీ…
జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటు లవంగి…
మర్లపడితే అది శివంగి
తీగలు లేని సారంగి…
వాయించబోతే అది ఫిరంగి..
గుడియా గుడియా గుడియా…
అది చిక్కీ చిక్కని చిడియా..
అది రమ్మంటె రాదురా సెలియా..
దాని పేరే సారంగ దరియా..
దాని సెంపలు ఎన్నెల కురియా
దాని సెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళ దునియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
Im excited to discover this web site. I want to to thank you for your time just for this fantastic read!! I definitely appreciated every part of it and I have you book marked to look at new information in your site.