Asha Pasham Song Lyrics

Print Friendly, PDF & Email

చిత్రం: కేర్ అఫ్ కంచరపాలెం
గానం: అనురాగ్ కుల్కర్ణి
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: విశ్వా
దర్శకుడు: మహా వెంకటేశ్

Asha Pasham Song Lyrics from Care of Kancharapalam Movie

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే

తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
సేరువైనా సేదూ దూరాలే

తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో

ఆటు పోటు గుండె మాటుల్లోనా… సాగేనా…

ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో

నిండు పున్నమేళ
మబ్బు కమ్ముకొచ్చి

సిమ్మ సీకటల్లిపోతుంటే
నీ గమ్యం గందరగోళం

దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
పల్లటిల్లిపోయి నీవుంటే

తీరేనా నీ ఆరాటం

ఏ హేతువు నుదుటి
రాతల్ని మార్చిందో

నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే.. నీ ఉనికి ఉండాలిగా..

ఓ… ఆటు పోటు గుండె మాటుల్లోన… సాగేనా…

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే

తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో

ఏ మలుపులోఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో నీ శైలిలో

సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం

నీవు పెట్టుకున్ననమ్మకాలు అన్ని
పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం

నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా

రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా

ఓ… ఆటు పోటు గుండె
మాటుల్లోన… ఉంటున్నా…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *