Cheliya Cheliya Song Lyrics from Gharshana Movie

Print Friendly, PDF & Email

చిత్రం: ఘర్షణ
నటీనటులు: వెంకటేశ్, అసిన్
గానం: సుచిత్ర
సంగీతం: హర్రీస్ జయరాజ్
సాహిత్యం: కుల శేఖర్
దర్శకుడు: గౌతమ్ వాసుదేవ్ మీనన్

Cheliya Cheliya Song Lyrics from Gharshana Movie

చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా

తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది

మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని

జ్నాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా…

చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా

తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

తడిసి పోతున్నా తడిసి పోతున్నా
శ్వాస నీవే తెలుసుకోవే

స్వాతి చినుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం

జాలి నాపై కలగదేమే
జాడ అయినా తెలియదేమే

ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం
ఎందుకమ్మా నీకీ మౌనం

తెలిసి కూడా ఇంకా దూరం
పరుగుతీస్తావు న్యాయమా ప్రియతమా…

చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా

తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

గుండెలోన వలపు గాయం
మంటరేపే పిదపకాలం

ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా

దూరమైన చెలిమి దీపం
భారమైన బతుకు శాపం

ప్రియతమా హృదయమా తరలిరా నే డైనా

కలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో

సేద తీరాలి చేరవా నేస్తమా…
చెలియ చెలియ చెలియ చెలియా

అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా

చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది

విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో

కాలమంతా మనది కాదు అని
జ్నాపకాలే చెలిమి కానుకని

వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *