పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
ఇస్తుంది ఎంతో హాయి నిత్యము
ఇస్తుంది ఎంతో హాయి నిత్యము
పోస్తుంది మనిషికి ప్రాణం ఇది సత్యము
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
వేదాల కాలంలోన చెట్టుతల్లి నీడలోన
విద్య నేర్చుకోలేదా ఆ కథలు మనమినలేదా
రారాజులు వేటకు వెళ్లి
వేటాడి అలసట చెంది
విరుల చెంతనే చేరి
విశ్రాంతిని పొందలేదా
ఎవరు దిక్కులేనట్టి ఎగిరేటి పక్షులకు
ఎవరు దిక్కులేనట్టి ఎగిరేటి పక్షులకు
గూడు కట్టుకోనిచ్చి తోడు నీడ తానవలేదా
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
కరువుతోటి కటకటలాడి బరువుతోటి బతికె మనుషులకు
కట్టెలమ్మి బ్రతుకని చెప్పి కల్పతరువు తానవలేదా
వెదురు బొంగులే ఇచ్చి పిల్లనగ్రోవిని చేసి
సంగీత సరిగమలూది సరసులకు పంచలేదా
నిలువ నీడ లేనట్టి నిర్భాగ్యులెందరికో
నిలువ నీడ లేనట్టి నిర్భాగ్యులెందరికో
కొమ్మనే కొంగుగా పరచి నీడనిచ్చి అమ్మవలేదా
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
కొత్తగా పెళ్ళైనట్టి కోరిన ప్రేమ జంటలను
మత్తులోన ముంచేయంగ మల్లెపూల మాలవలేదా
సభలలోన సన్మానంలో సౌందర్య కాంతుల నింప
మెడన పూల దండవలేదా జడన పూల చెండవలేదా
వనమూలికలౌషధమై మన ఒంటికి పూయంగా
వనమూలికలౌషధమై మన ఒంటికి పూయంగా
రోగాలను పోగొట్టేటి రాగాల పెట్టెవలేదా
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
ఆఆఆ…
పచ్చాపచ్చాని చెట్టు ప్రాణాలకు ఆయువుపట్టు
శ్వాసించును లోకం చుట్టూ ద్వేషించదు దేనిని ఒట్టు
చిరుగాలిని చెంతకు నెట్టు చిరాకులు తొలిగేటట్టు
ప్రగతికే పెట్టని మెట్టు పచ్చనైన చల్లని చెట్టు
పర్యావరణాన్ని పదే పదే కాపాడంగా
పర్యావరణాన్ని పదే పదే కాపాడంగా
నాటండి తలా ఓ చెట్టు నేలంతా ఈనేటట్టు
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము
చేసి చూడు ఒక్కసారి నేస్తము
queen of the south ringtone https://ringtonessphone.com/queen-of-the-south-ringtone.html
best ringtones https://ringtonessbase.com
home and office sounds https://sounddeffects.com/home-and-office-sounds
theme songs https://downloadfreeringtoness.com/theme-songs