Sai Chalisa Lyrics

Print Friendly, PDF & Email

The “Sai Chalisa” is a devotional hymn dedicated to Sai Baba of Shirdi, a spiritual luminary who embodies love, compassion, and wisdom. Sai Chalisa song praises Sai Baba’s divine attributes, encapsulating his role as a guide and protector on the spiritual path. Below mentioned are the Sai Chalisa lyrics in Telugu. Feel the devotion and surrender as you chant the Sai Chalisa, reflecting on the divine qualities of Lord Sai Baba. May His grace and blessings be with you always.

Sai Chalisa Lyrics in Telugu

షిరిడీవాస సాయిప్రభో… జగతికి మూలం నీవే ప్రభో..
దత్త దిగంబర అవతారం.. నీలో సృష్టి వ్యవహారం… ||2||
త్రిమూర్తి రూపా ఓ సాయీ… కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్యా… ముక్తికి మార్గం చూపుమయా…
||షిరిడీవాస సాయిప్రభో||

కఫిని వస్త్రము ధరియించి.. భుజమునకు జోలీ తగిలించి..
నింబ వృక్షము ఛాయలో… ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి.. త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం… భక్తుల మదిలో నీ రూపం…

||షిరిడీవాస సాయిప్రభో||

చాంద్ పాటిల్ ను కలుసుకుని… ఆతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి… పాటిల్ బాధను తీర్చితివి…
వెలిగించావు జ్యోతులను… నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం… చూసి వింతైన ఆ దృశ్యం…

||షిరిడీవాస సాయిప్రభో||

బాయ్జా చేసెను నీ సేవ… ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి… తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి… ప్రేమతో వాటిని లాలించి…
జీవులపైన మమకారం… చిత్రమయా నీ వ్యవహారం…

||షిరిడీవాస సాయిప్రభో||

నీ ద్వారములో నిలిచితిని… నిన్నే నిత్యం కొలిచితిని
అభయము నిచ్చి బ్రోవుమయా… ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ… నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి… పాపము పోవును తాకిడికి…

||షిరిడీవాస సాయిప్రభో||

ప్రళయ కాలము ఆపితివి… భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం… కాపాడి షిరిడి గ్రామం…
అగ్నిహోత్రి శాస్త్రికి… లీలా మహత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి… పాము విషము తొలగించి…

||షిరిడీవాస సాయిప్రభో||

భక్త భీమాజీకి క్షయరోగం… నశియించే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు… వ్యాధిని మాయం చేసావు…
కాకాజీకి ఓ సాయి… విఠల దర్శన మిచ్చితివి…
దామూకిచ్చి సంతానం… కలిగించితివి సంతోషం…

||షిరిడీవాస సాయిప్రభో||

కరుణాసింధూ కరుణించు… మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము… పెంచుము భక్తి భావమును…
ముస్లిం అనుకొని నిను మేఘా… తెలుసుకుని ఆతని బాధ
దాల్చి శివశంకర రూపం… ఇచ్చావయ్యా దర్శనము…

||షిరిడీవాస సాయిప్రభో||

డాక్టరుకు నీవు రామునిగా… బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరుగు మారుతిగా… చిదంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా… గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి… దర్శనము మిచ్చిన శ్రీసాయి…

||షిరిడీవాస సాయిప్రభో||

రేయి పగలు నీ ధ్యానం… నిత్యం నీ లీలా పఠనం…
భక్తితో చేయ్యండి ధ్యానం… లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు… బాబా మాకవి వేదాలు…
శరణణి వచ్చిన భక్తులను… కరుణించి నీవు బ్రోచితివి…

||షిరిడీవాస సాయిప్రభో||

అందరిలోన నీ రూపం… నీ మహిమా అతిశక్తిమాయం…
ఓ సాయి మేము మూఢులము… ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నీవే నయమూలం… సాయి మేము సేవకులం
సాయి నామమే తలచెదము… నిత్యము సాయిని కొలిచెదము…

||షిరిడీవాస సాయిప్రభో||

భక్తి భావన తెలుసుకొని… సాయిని మదిలో నిలుపుకొని
చిత్తంతో సాయీ ధ్యానం… చెయ్యండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది… నివారించెను అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి… భక్తులను కాపాడేనోయి…

||షిరిడీవాస సాయిప్రభో||

మన ప్రశ్నలకు జవాబులు… తెలుపును సాయి చరితములు…
వినండి లేక చదవండి… సాయి సత్యము చూడండి…
సత్సంగమును చేయండి… సాయి స్వప్నము పొందండి…
భేద భావమును మానండి… సాయి మన సద్గురువండి…

||షిరిడీవాస సాయిప్రభో||

వందనమయ్యా పరమేశా… ఆపద్భాందవ సాయీశా…
మా పాపములూ కడతేర్చు… మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి… కరుణతో మము దరిచేర్చోయి..
మా మనసే నీ మందిరము… మా పలుకులే నీకు నైవేద్యం…

షిరిడీవాస సాయిప్రభో… జగతికి మూలం నీవే ప్రభో..
దత్త దిగంబర అవతారం.. నీలో సృష్టి వ్యవహారం…
నీలో సృష్టి వ్యవహారం… నీలో సృష్టి వ్యవహారం…

|| శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కి జై ||

Read More Devotional Songs

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *