చిత్రం: సలార్
నటీనటులు: ప్రభాస్, ప్రిథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్
గానం: హరిణి ఇవటూరి
సంగీతం: రవి బసృర్
సాహిత్యం: కృష్ణకాంత్
దర్శకుడు: ప్రశాంత్ నీల్
Here is the soul-stirring beauty of Salaar Sooreede song lyrics in Telugu, a melody that captivates the heart with its evocative verses. Penned in the enchanting Telugu language, these lyrics beautifully narrate the essence of the song, showcasing the depth of emotion and cultural richness embedded within.
Sooreede Song Lyrics in Telugu from Salaar Movie
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటి లోను
నీడలా ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసేది కన్ను వాడు
ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టే పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చె చినుకుల
దూకుతాడు
ముప్పు కలగక
ముందు నిలబడి ఆపుతాడు
ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన
ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకడు
సైన్యమొకడు
కలిసి కదిలితే
కదనమే
ఒకరికొకరని
నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరేళ్లు నిలవాలే
కంచె ఒకడైతే
అది మించె వాడొకడే
ఒకడు చిచ్చుర
ఒకడు తిమ్మెర
కలిసి దహనాలే
వేగమొకడు త్యాగమొకడు
గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరేళ్లు నిలవాలే
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటి లోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసేది కన్ను వాడు