Emannavo Em Vinnano Song Lyrics

Print Friendly, PDF & Email

చిత్రం: నవ మన్మధుడు
నటీనటులు: ధనుష్, సమంత
గానం: శ్వేతా మోహన్
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: రాకేందు మౌళి

A nice song from the movie Navamanmadhudu. Emannavo Emvinnano Song is one of the most favorite & popular songs which received compliments from the audience. Check out the Telugu lyrics of emannavo song.

Emannavo Em Vinnao Song Lyrics in Telugu from Navamanmadhudu Movie

ఏమన్నావో, ఏం విన్నానో!
కన్నుల్తో మాటాడే భాషే వేరు
ఏదో మాయ చేసావయ్య
మనసుల్తో పాటాడే రాగం వేరు

చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే
గుచ్చే చూపుల్లోన, అరవిచ్చే నవ్వుల్లోన,
నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన

ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే

రేపుల్లో మాపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ
చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది
చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు
సంపెంగ పూల ముద్దు చంపుతున్నది

ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా
నా నీడ రెండుగా తోచె కొత్తగా
నా కంటిపాపలే నీ చంటి బొమ్మలే మూసేటి రెప్పలే దాచె మెత్తగా

చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే
గుచ్చే చూపుల్లోన, అరవిచ్చే నవ్వుల్లోన,
నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన

ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే

ఏమన్నావో, ఏం విన్నానో!
కన్నుల్తో మాటాడే భాషే వేరు
ఏదో మాయ చేసావయ్యా
మనసుల్తో పాటాడే రాగం వేరు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *