చిత్రం: హుషారు
నటీనటులు: రాహుల్ రామకృష్ణ, తేజ్
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: సిద్ శ్రీరామ్
సంగీతం: రాధన్
A nice song from the movie of Hushaaru. Undiporaadhey song is one of the most popular songs sung by Sid Sri Ram and received over 30 million views from the audience on youtube. Check out the undiporaadhey song lyrics in Telugu below.
Undiporaadhey Song Lyrics in Telugu from Hushaaru
ఉండిపోరాదే.. గుండెనీదేలే..
హత్తుకోరాదే.. గుండెకేనన్నే..
అయ్యో.. అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్లీ.. మళ్లీ గాళ్లో మేఘమై తేలుతున్నది
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే.. గుండెనీదేలే..
హత్తుకోరాదే.. గుండెకేనన్నే.. ఓఒఒఓ
నిసిలో ససిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడ నీడలా నీవెంటే నేనుండగా…
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులే
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే.. హేఏఏ