చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
నటీనటులు: సిద్ధార్థ, త్రిష
సాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్. పి. బాలసుబ్రమణ్యం
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
A famous song with wonderful lyrics from the Nuvvosthanante Nenoddhantana movie starring Trisha & Siddhartha. This movie tells us about the depth of love and one can do anything for it. It was & is the favourite song of many. Check out the Telugu lyrics of Ghal Ghal Song below.
Ghal Ghal Song – Nuvvosthanante Nenoddhantana Song Lyrics in Telugu
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా
వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం
పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి
మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
ప్రాణం ఎపుడు మొదలైందో
తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే
ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
మండే కొలిమినడగందే తెలియదే
మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెపుతుందే
పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువైవుండే విలువే వుంటే
అలాంటి మనసుకు తనంతా తానై
అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే
నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా