చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్
నటీనటులు: రోహిత్, గజాలా, రేఖ, ప్రేమ
గానం: ఎస్.పి. బాలు
సంగీతం: ఘంటాది కృష్ణ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
దర్శకుడు: అంజి శ్రీను
Rivvuna Egire Guvva Song Lyrics in Telugu from Janaki Weds Sriram Movie
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మ
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మ
నా పెదవుల చిరునవ్వా
నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
ఓ ఓ ఓ ఏ ఏ ఏ
వీచే గాలుల వెంట నా వెచ్చని ఊపిరినంత
పంపించానే అది ఏ చోట నిను తాకనే లేదా
పూచే పూవుల నిండా మన తీయని జ్ఞాపకమంతా
నిలిపుంచానే నువ్వు ఏ పూటా చూడనే లేదా
నీ జాడను చూపించంటు ఉబికేనా ఈ కన్నీరు
ఏ నాడు ఇలపై పడి ఇంకిపోలేదు
నడిరాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు
ఆ దారిని తూరుపువై రావా
నా గుండేకు ఓదారుపు
రివ్వున ఎగిరే గువ్వా నీ
పరుగులు ఎక్కడికమ్మ
నా పెదవుల చిరునవ్వా నిను ఎక్కడ
వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
కిన్నెరసాని నడక నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా కడదాక తోడై రాక
బతుకే బరువైపోగా మిగిలున్న ఒంటరి శిలగా
మన బాశల ఊసులు అన్ని కరిగాయా ఆ కలగా
ఎన్నెన్నో జన్మలదాక ముడివేసిన మన అనుబంధం
తెగి పోయిందంటే నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నదంటే ఇంకా నా ఈ దేహం
క్షేమంగ ఉన్నట్టే తనకూడా నాస్నేహం
ఎడబాటే వారదిగా చేస్తా
త్వరలోనే నీ జతగా వస్తా
రివ్వున ఎగిరే గువ్వా నీ
పరుగులు ఎక్కడికమ్మ
నా పెదవుల చిరునవ్వా నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా