Life of Ram Song Lyrics

Print Friendly, PDF & Email

చిత్రం: జాను
నటీనటులు: శర్వానంద్, సమంత
గానం: ప్రదీప్
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
దర్శకుడు: సి. ప్రేమ్ కుమార్

Life of Ram Song Lyrics in Telugu from Jaanu Movie

ఏ దారెదురైనా ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.

ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా

ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా యద లయను కుశలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా

అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా

గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా

నిలకడగ

యే….. చిరునామా లే
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తోందో కేక….. మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా యద లయను కుశలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా

విన్నారా

నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా

అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది

జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది

జోలాలి

తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……

To encourage someone who has an interest in singing, we are providing the Life of Ram Video Song Lyrics youtube video link: Life of Ram Song by Indumadhuri.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *