Butta Bomma Song Lyrics

Print Friendly, PDF & Email

చిత్రం: అల వైకుంఠపురంలో (2020)
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: అర్మన్ మాలిక్
నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే
దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్

Butta Bomma Song Lyrics in Telugu from Ala Vaikuntapuramlo Movie

ఇంతకన్న మంచి పోలికేది
నాకు తట్టలేదు కానీ అమ్ము

ఈ లవ్ అనేది బబ్ల్యూ గమ్ము
అంటుకున్నదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్న మాటే గాని
మల్లి అంటన్నానే అమ్ము
ఇది చెప్పకుండ వచ్చే తుమ్ము
ప్రేమనాపలేరు నన్ను నమ్ము

ఎట్టగా అనే ఎదురుచూపుకి
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరే దేవుడా, ఇదేం అనేంత లోపటె
పిల్లడా అంత దెగ్గరయి నన్ను చేరదీస్తివే

బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్ట బొమ్మై
జంట కట్టుకుంటివే

బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్ట బొమ్మై
జంట కట్టుకుంటివే

మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా
మౌనంగున్న గానీ అమ్ము
లోన డండనక జరిగిందే అమ్ము
దిమ్మ తిరిగినాదే మైండ్ సిమ్ము

రాజుల కాలం కాదు
రథమూ గుర్రం లేవు
అద్దం ముందర నాతో నేనే
యుద్ధం చేస్థాన్టే

గాజుల చేతులు జాపి
దెగ్గరకొచ్చిన నువ్వు
చెంపల్లో చిటికేసి, చక్రవర్తిని చేసావే

చిన్నగా చినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లె పూవునడిగితే
మూటగ పూల తోటగా, పైనొచ్చి పడితివే

బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్ట బొమ్మై
జంట కట్టుకుంటివే

వేలి నిండా నన్ను తీసి
బొట్టు పెట్టుకుంటివే
కాలి కింది పువ్వు నేను నెత్తినెట్టుకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది
నాకు తట్టలేదు కానీ అమ్ము

ఈ లవ్ అనేది బబ్ల్యూ గమ్ము
అంటుకున్నదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్న మాటే గాని
మల్లి అంటన్నానే అమ్ము
ఇది చెప్పకుండ వచ్చే తుమ్మో
ప్రేమనాపలేరు నన్ను నమ్ము

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *