చిత్రం: మెరుపు కళలు
నటీనటులు: ప్రభు దేవా, కాజోల్, అరవింద్ స్వామి
గానం: హరి హరన్, సాధన సర్గం
సంగీతం: ఏ. ఆర్. రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
A fantastic & lovable song from Merupu Kalalu movie casting Prabhu Deva, Kajol & Aravind Swamy. Vennelave Vennelave Song still has the worth to reach lakhs of people and entertains the audience. One of the best songs for singing competitions. Vennelave Vennelave Song Lyrics have been written by Veturi and the song is sung by Hari Haran and Sadhana Sargam. Vennelave Vennelave Song music has been composed by our favourite musician, A.R. Rahman.
Vennelave Vennelave Song Lyrics in Telugu
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే హాయ్
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
ఇది సరాసాలా తొలిపరువాలా
జత సాయంత్రం సైఅన్న మందారం
ఇది సరాసాలా తొలిపరువాలా
జత సాయంత్రం సైఅన్న మందారం
చెలి అందాలా చెలి ముద్దాడే
చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
పిల్లా ఆ. పిల్లా ఆ
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా
పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
ఈ పూవుల్లో తడి అందాలో
అందాలే ఈ వేళా
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ
పిల్లా ఆ. పిల్లా ఆ
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
ఆహ వయసే రసాల విందైతే
ప్రేమల్లే ప్రేమించు
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా